ఎపి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామని సిఎం పేర్కొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జరుగనున్నాయి.