క్రిస్మ‌స్ వేడుక‌ల్లో సిఎం కెసిఆర్‌..

హైద‌రాబాద్‌(CLiC2NEWS): రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. హైద‌రాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మంలో కెసిఆర్‌తో పాటు హ‌రీశ్‌రావు, మ‌హ‌మూద్ ఆలీ, కొప్పుల ఈశ్వ‌ర్, ఇత‌ర‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్న‌తాధికారులు హ‌జ‌ర‌య్యారు. సిఎం కేక్ క‌ట్‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మ‌తాల వారికి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌త‌ప‌ర‌మైన దాడుల‌కు పాల్ప‌డిన వారిని స‌హించేది లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌లో ఉండే ప్ర‌తి ఒక్క‌రూ కుల‌మ‌తాల‌కు అతీతంగా ముందుకు సాగాల‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.