కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ స్పందన..

హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. దశ, దిశ, నిర్దేశం లేని నిష్ప్రయోజనకర బడ్జెట్ ఇది అని, ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టి వర్గాలతో పాటు దేశ రైతాంగం , సామాన్యులు, పేదలు, ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈమేరకు తెలంగాణ సిఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉద్యోగులు, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురిచేశారని చెప్పారు. వ్యవసాయరంగానన్ఇ ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. వ్యవసాయరంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో అని కెసిఆర్ ధ్వజమెత్తారు.
వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త ఇన్‌ఫ్రాప్ట్రక్చర్‌ను అభివృద్ధి పరుస్తుంటే.. ఆదిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని విమర్శించారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైనన మౌలిక వసతుల పురోగతికి చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కెసిఆర్ విమర్శించారు.