పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంను ప్రారంభించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంను ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ విపత్తు తలెత్తినా పోలీసు శాఖ ముందుంటుందని, ఉత్తమ పోలీసు వ్యవస్థ ఉంటే సమాజం బాగుంటుందని అన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణానికి డిజపి మహేందర్ రెడ్డి ఎంతగానో శ్రమించారని అన్నారు. చిత్త శుద్ధి, వాక్ శుద్ధి, సందర్భ శుద్ధి ఉంటే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చిన సిఎం అన్నారు.
ఈసందర్భంగా రాష్ట్ర పోలీసు శాకకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సంకల్ప బలానికి ప్రతీక అని రాబోయే రోజులలో పోలీసులు మరింత చుకుకుగా పనిచేయాలని అన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని, అత్యధిక శక్తివంత దేశమైన అమెరికా అమలు చేస్తున్న విధానాలను అనుసరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. పోలీసుశాఖలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని సిఎం తెలిపారు.