దార్శనికుడు అంబేద్కర్: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 జయంతి పురస్కరించుకొని సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్ధిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని సిఎం కొనియాడారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశ్యంతో, వారికి ఖచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.
ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను సిఎం స్మరించుకున్నారు. దళితసాధికారత కోసం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా, దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి రూ. 10 లక్షల భారీ మొత్తాన్ని వంద శాతం సబ్సిడి కింద ఆర్ధిక సహాయం అందిస్తున్నదని సిఎం పేర్కొన్నారు.