బోయ‌గూడ ఘ‌ట‌న‌పై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి.. రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్రకటన

హైద‌రాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ బోయ‌గోడ‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి రూ. 5ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. కార్మికుల మృత‌దేహాల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని సిఎస్ సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు. బోయ‌గూడ స్క్రాప్ దుకాణంలో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 11 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. ప్ర‌మాద స‌మ‌యంలో దుకాణంలో 15 మంది కార్మికులు నిద్రించారు. ఇద్దరు కార్మికులు ప్ర‌మాదం నుండి బ‌య‌ట ప‌డ్డారు. మిగిలిన 13 మంది మంట‌ల్లో చిక్కుకున్నారు. వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.