శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్

చెన్నై(CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సమేతంగా సోమవారం తమిలనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి శోభ, ఆయన కుమారుడు కెటిఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్ తదితరులు వున్నారు. సిఎం కెసిఆర్ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.