వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజిస్తారని, విఘ్నాలు తొలగించే దైవంగా హిందూ సాంప్రదాయంలో వినాయకునికి అత్యంత ప్రాధాన్యతవున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు సాగే ఉత్సవాలు సహా, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని పార్వతీ తనయుడు గణనాథున్ని ముఖ్యమంత్రి కెసిఆర్ వేడుకున్నారు.