పార్టి అగ్ర నేతలతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ..

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టి ఆగ్రనేతలతో భేటీ అయ్యారు. సిఎంతో పాటు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరంతా రాహుల్ గాంధీ, ఎఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేసినవి, పెండింగ్‌లో ఉన్నవాటిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్నతాజా రాజకీయ పరిణామాలు, కేబినేట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఉగాది నాటికి మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.