Gujarat: సిఎం విజయ్‌రూపానీ రాజీనామా
గాంధీనగర్ (CLiC2NEWS): గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను సిఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని శనివారం గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు సమర్పించారు. ఈయన 2016 ఆగస్టు 7వ తేదీనుండి గుజరాత్‌కు సిఎంగా ఉన్నారు.
రూపానీ రాజనామా గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే, రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు.
గాంధీనగర్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశం తర్వాత గుజరాత్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశారు. తన రాజీనామా సమర్పించిన తరువాత, రూపానీ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి రూపానీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తన ఆకస్మిక రాజీనామా వెనుక గల కారణాల గురించి ప్రశ్నలను సమాధానం దాటవేశారు.