విశాఖలో విషాదం.. అనకాపల్లి వద్ద కూలిన వంతెన

అనకాపల్లి (CLiC2NEWS): విశాఖ జిల్లాలోని అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లి శంకర్‌మఠ్ కూడలి వదద్ ఇంటర్ చేంజ్ రహదారి నిర్మిస్తున్నారు. ఇందు బాగంగా నిర్మాణంలో వంతెన సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది.
ఈ ప్రమాదంలో ఓ కారు, ఓ ఆయిల్ ట్యాంకర్ లారీ నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు (బాలుడు, యువకుడు) మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అటు లారీ డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని హుటాహుటిన గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు. ఈ సంఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.