కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు నాలుగవ పతకం
బర్మింగ్ హామ్ (CLiC2NEWS): కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి(22) 55 కేజీల విభాగంలో రజతం సాధించింది. మొత్తం 202 కేజీల బరువును ఎత్తి బింద్యారాణి భారత్‌కు నాల్గవ పతకం ఖరారు చేసింది. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. పురుషుల 55 కేజీల విభాగంలో సాకేత్ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం పతకాన్ని సాధించారు.