శంషాబాద్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

శంషాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ ప‌రిధిలోని శాతంరాయి వ‌ద్ద ఆదివారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైద‌రాబాద్ వస్తుండ‌గా కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొంట్టి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఓ యువ‌తి మృతి చెందింది.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని స్థానికులు ద‌వాఖానాకు త‌ర‌లించారు. కాగా మ‌ర‌ణించిన యువ‌తిని తెలంగాణ పిసిసి మైనార్టీ విభాగానికి చెందిన ప్ర‌ముఖ నాయ‌కుడు, నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇంచార్జీ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) గా గుర్తించారు. తానియా మృత‌దేహాన్ని పోలీసులు ఉస్మానియాని త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.