ఆరుగురు ‘గులాబి’ ఎమ్మెల్సీలు ఏక‌గ్రీవం..

హైద‌రాబాద్‌(CLiC2NEWS): వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ‌రంగ‌ల్ స్థానికి సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి 14 మంది నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా 10 నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణకు గుర‌య్యాయి. నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుండి పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు ఏక‌గ్రీవంగా ఎన్నికైనారు. మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టిఆర్‌ఎస్ అభ్య‌ర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. జిల్లాలో వీర‌పై పోటీకి బ‌రిలో నిలిచిన స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకొన్నారు.

Leave A Reply

Your email address will not be published.