TS: కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ (CLiC2NEWS): నగర శివార్లలోని రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఉంటున్న కానిస్టేబుల్ బండ వాసు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జాతీయ పోలీసు అకాడమీలో వాసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే వాసు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.