Corona: తెలంగాణలో కొత్తగా 7,432 కేసులు

హైదరాబాద్‌(CLiC2NEWS):  తెలంగాణలో క‌రోనా సెకండ్‌ వేవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1,03,770 పరీక్షలు నిర్వహించగా రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం క‌రోనా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వివ‌రాలు వెల్ల‌డించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసులు 3.87లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు.

తాజాగా క‌రోనా నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.26 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు వెల్ల‌డించారు.

కొత్త‌గా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో అత్యధికంగా 1,464 కేసులు న‌మోదయ్యాయి. మేడ్చల్‌లో 606, రంగారెడ్డి 504, నిజామాబాద్‌ 486, ఖమ్మం 325 వరంగల్‌ అర్బన్‌ 323, మహబూబ్‌నగర్‌ 280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.