Corona : ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి?

హైదారబాద్ (CLiC2NEWS): కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు సైతం ఇండియాను రెడ్ జోన్ గా ప్రకటించి.. భారతీయులకు తమ దేశాలలోకి అనుమతి లేదంటూ కరాఖండిగా చెప్పెశాయి. మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుద‌ల చేసిన కరోనా బులిటెన్ మేరకు దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. గత 24 గంటల్లో 2,51,857 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు మొత్తం దేశంలో 1,45,56,209 మంది కోలుకున్నారు. కాగా కొత్తగా దేశంలో కరోనాబారిన పడి 2771 మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నా కానీ కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ధైర్యంగా ఆసుపత్రిలకు వస్తున్నారు. ఇక చాలా మంది ర్యాపిడ్ టెస్టుల కంటే.. ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ రెండు టెస్టులకు మధ్య ఉన్న తేడాను ఒకసారి పరిశీలిస్తే..

ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను పాయింట్ ఆఫ్ కేర్ అంటారు. అంటే వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకోవచ్చు. అదే ఆర్టీపీసీఆర్కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉండాలి. ట్రూనాట్ అనేది ఒక చిప్ బేస్డ్ టెస్టింగ్. మన శరీరంలో ఎక్కువ జీన్లు ఉంటాయి. అయితే ఇది కొన్ని జీన్ లను మాత్రమే కనుక్కుంటుంది. వీటిలో వైరస్ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఎక్కువ జీన్ లను గుర్తించే అవకాశం ఉంటుంది. కేసులు కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది కాబట్టి, అలాగే ఎక్కడైనా టెస్టు చేసేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇచ్చారు.

గొంతులో ద్రవం తీసి కిట్పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. ఇందులో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్కు వెళ్లి నిర్ధారించుకోవచ్చు. ఆర్టీపీసీఆర్నే గోల్డెన్ స్టాండర్డ్ టెస్టుగా చెప్పుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.