Corona: ఎపిలో కొత్తగా 9,881 కరోనా కేసులు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74,041 శాంపిల్స్ పరీక్షించగా 9,881 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం సాయంత్రం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,43,441 కి చేరింది. తాజాగా 4,431 కరోనా బారి నుండి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,40,574 కరోనా నుంచి కోలుకున్నారు.
మరణాలు జిల్లాల వారీగా..
చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కాగా గత 24 గంటల్లో కోవిడ్‌తో 51 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 7,736 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 95,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.