Corona: తెలంగాణలో కొత్తగా 6,206 కేసులు

హైదరాబాద్ (clic2news): తెలంగాణ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో 1,05,602 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులున్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొవిడ్ బారిన ప‌డి 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,005 న‌మోద‌య్యాయి. ఆ తర్వాత అత్యధికంగా మేడ్చల్‌లో 502, రంగారెడ్డి 373, నిజామాబాద్‌ 406, మహబూబ్‌నగర్‌ 271, జగిత్యాల 257, మంచిర్యాల 226, కామారెడ్డి 188 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.