Corona: దేశంలో కొత్తగా 3.23 లక్షల కేసులు, 2,771 మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ క‌రోనాబులిటెన్ విడుద‌ల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. గ‌త 24 గంట‌ల్లో 2,51,857 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు మొత్తం దేశంలో 1,45,56,209 మంది కోలుకున్నారు. కాగా కొత్త‌గా దేశంలో క‌రోనాబారిన ప‌డి 2771 మృత్యువాత‌ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో వైర‌స్‌ బారినపడి మొత్తం 1,97,894 మంది మ‌ర‌ణించారు. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.