Corona: దేశంలో 2263 మ‌ర‌ణాలు

కొత్త‌గా 3,32,730 మందికి పాజిటివ్‌

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా రోజుకు రెండువేల మందికిపైగా ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్రం శుక్ర‌వారం క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కి చేరింది. వీటిలో 1,36,48,159 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 24,28,616 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2263 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,80,920కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.