Immunity : వ్యాధినిరోధక శక్తి పెరగటానికి ఆరు సూత్రాలు..

ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విస్తరించి భయంప్రకంపనలు పుట్టిస్తుంది. ఎక్కడ చూసినా కరోన రోగులే ఎక్కువగా వున్నారు. దీనికి కారణం మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. ప్రస్తుత పరిస్థితులలో శరీరానికి సరైన వ్యాయామం లేక సరైన తిండి లేక, చెత్త ఆహారపదార్దాలు తినటం, పగలు పడుకోవటం, రాత్రి దయ్యాలగా తిరగటం, విచ్చలవిడిగా ఆల్కహాల్ తాగటం, గుట్కా, తినటం, పరిశుభ్రత లేకపోవటం, సరైన నీరు తాగకపోవటం, కూల్డ్రింక్స్, పిజ్జా, బర్గర్, స్నాక్స్, ఆలూచీవ్స్, కొన్ని హోటళ్లు, కర్రీ పాయింట్లలో నాణ్యతా లోపంతో తయారు చేసిన కారాలు తో చేసిన కూరలు తినటం, సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం, వీటి వలన వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లి ఏదైనా జబ్బు వస్తే వెంటనే రోగులుగా మారటం జరుగుతుంది.
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా అవటం, అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, ఉదయం నుండి సాయంత్రం దాకా పలువురిని దుర్భాషలాడటం. ఇతరుల మీద అనవసరం బురద చల్లటం (లేనిపోని అభాండాలు వేయటం) తరువాత మన పని మనం సరిగా చేసుకోలేక ఒకేసారి నెత్తిమీద భారం పడటం.. ఇలాంటివి అన్నీ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తాయి. వీటి వల్ల లేనిపోని జబ్బులు వస్తాయి. ఒకసారి జబ్బు వస్తే మరల పోవటం అసాధ్యం.
వీటి నివారణకు, వ్యాధినిరోధక శక్తి పెరగటానికి పంచ సూత్రాలు..
- 1. పాజిటివ్ థింకింగ్ చేయాలి. (సకరాత్మక ఆలోచనలు చేయాలి.)
- 2. ధమాక్ తండా రఖ్నా (మెదడును ప్రశాంతంగా ఉంచాలి.)
- 3. జాబాన్ నరం రఖ్నా, (ఎక్కువగా మాట్లాడ వద్దు)
- 4. జేబు గరం రఖ్నా (అంటే జేబులో నాలుగు చిల్లర డబ్బులు ఉండాలి)
- 5. దిల్ మీ రాహ్మ్ రఖ్నా (మంచి మనసుతో ఉండాలి.)
- 6. అఖో మే రేష్మ రఖ్నా (కళ్ళలో కాంతి,ప్రేమ ,కరుణ,చూపించాలి)
పైన పేర్కొన్న ఈ ఐదు సూత్రాలు మానవ జీవితంలో అందరికీ చాలా అవసరం.
ఇమ్మ్యూనిటి బూస్టర్ కొన్ని చిట్కాలు.
1. అశ్వగంధ పొడి.. ఇది వారంలో రెండు సార్లు ఒక గ్లాస్ వేడి పాలలో అర టీ స్పూన్ వేసుకొని దీనిలో టీ స్పూన్ పటిక బెల్లం చూర్ణం కలిపి తాగండి. తల నుండి కింద కాళ్ళ గొర్ల వరకు ఫుల్ స్టాండ్ గా, ఫిజికల్ గా వుంటారు. గుఱ్ఱం సచ్చే వరకు నిలబడే ఉంటుంది. అలానే మీకు వ్యాధినిరోధక శక్తి సూపర్ గా ఉంటుంది. కరోన వైరస్ దరిదాపు రాదు. ఇది 40 సార్లు కంటే ఎక్కువగా తీసుకోరాదు. గర్భవతులు అసలు తీసుకోవద్దు. మిగతవారు hiv ఉన్నా సరే దీనిని నిర్భయంగా వాడవచ్చును. ఎండాకాలంలో నెలకు 4 సార్లు తీసుకుంటే చాలు.
2. తిప్పతీగ.. టైఫాయిడ్, మలేరియా, డెంగీ, వైరల్ ఫివర్స్, మరల మరల వచ్చే విషజ్వరాలకు ఇది వాడితే, జబ్బుని తిప్పి తిప్పి బయటికి పంపుతుంది.
3. చవన్ ప్రాష్.. బెస్ట్ ఇమ్మ్యూనిటి బూస్టర్. దీనిలో అన్ని వనమూలికలతో తయారుచేసినది. ఉదయం పూట ఒక టీ స్పూన్ నాకీ, 30 నిమిషాల తరువాత వేడి వేడి పాలు తాగాలి. చవన్ ప్రాష్ వారానికి 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఎండాకాలంలో ఎక్కువగా తీసుకుంటే కండ్లు మంట పుడతాయి. గర్భవతులు తీసుకోవద్దు. మధుమేహ రోగులు వైద్యుని సలహామేరకు వాడగలరు.
4. వేడి నీటితో ఆవిరి యూకాలిప్ట్ డ్రాప్స్ తో లేక zandu balm మాత్రమే వాడాలి.
5. పసుపు తో ఆవిరి పడితే పొడి దగ్గు రావచ్చును.
6. లవంగాలు నోటిలో బుగ్గనా ఇష్టం వచ్చినట్లు పెట్టి సప్పరిస్తే పొడి దగ్గు వస్తుంది.
7. ఫైనల్ గా ఉదయం పరిగడుపున వేడి నీరు 1 గ్లాస్ నిమ్మరసం 1 టీ స్పూన్,2 టీ స్పూన్ తేనే కలిపి తాగండి.
హెచ్చరిక: అల్లం, మిరియాలు, శొంఠి, దాల్చిన చెక్క, వాము, ఇష్టం వచ్చినట్లు వాడితే కడుపు మంట, ఎసిడిటీ, indigestion, శరీరంలో వేడి పెరిగి కళ్ళు మంట పుట్టి నీరు రావటం జరుగుతుంది.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు