Corona Effect: రేప‌టి నుంచి కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు రద్దు..

కాళేశ్వ‌రం (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా రాష్ట్ర స‌ర్కార్ నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి కే రాష్ట్రంలోని ప‌లు దేవాల‌యాల్లో ద‌ర్శ‌నాలు నిలిపి వేశారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ దేవస్థానం అధికారులు వెల్లడించారు. అయితే.. స్వామివారికి అర్చకులు నిత్యం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బంది, ఓ అర్చకుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని.. అలాగే గ్రామంలో 50కిపైగా కేసులు నమోదయ్యాయని ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. భ‌క్తులు స‌హ‌క‌రించ‌గ‌ల‌ర‌ని అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.