ప్రజల సహకారంతోనే కరోనా మూడోదశ నుండి బయటపడగలం: హరీశ్‌రావు
సత్తుపల్లి (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి హారీశ్‌రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ. 34 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లిలో రూ.1.25 కోట్లతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేశామని, కల్లూరు, పెనుబల్లి అస్పత్రులకు నూతన భవనాలు నిర్మిస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని మంత్రి అన్నారు. కరోనా మహమ్మారి నుండి త్వరలోనే బయటపడతామని, ప్రజలు సహకరిస్తే మూడోదశ నుండ బయటపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.