Corona Virus: దేశంలో 3.46,786 కేసులు.. 2,624 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ల‌క్ష‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 3.46,786 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ క‌రోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2624 మంది మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,89,544కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 2,19,838 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా కోటీ 38 ల‌క్ష‌ల మంది వైర‌స్‌ను జ‌యించారు. ప్ర‌స్తుతం దేశంలో 25,52,940 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.