వెంక‌ట్రామిరెడ్డితో క్ష‌మాప‌ణ‌లు చెప్పిస్తాం..: హైకోర్టుకు తెలిపిన ఎజి

ఎమ్మెల్సీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెల‌గాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులను హైకోర్టు జారీ చేసింది. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు కోర్టు ధిక్క‌ర‌ణ వ్యాఖ్య‌లు చేశారంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. వరి విత్తనాలు వేయవద్దని గతంలో ఆయన వ్యాఖ్యానించారని… కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా పట్టించుకోమన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సింగిల్‌ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని వెంకట్రామిరెడ్డిని ఆదేశించింది.

అయితే దీనిపై ఎజి స్పందిస్తూ.. వెంకట్రామిరెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.