మైనారిటి గురుకుల పాఠ‌శాల‌లో 20 మందికి కొవిడ్ పాజిటివ్

సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలోని మైనారిటి గురుకుల పాఠ‌శాల‌లో 20 మంది బాలిక‌ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. హుస్నాబాద్‌లోని మైనారిటి గురుకుల బాలిక‌ల పాఠ‌శాల‌లో సోమ‌వారం జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న విద్యార్థుల‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది పాఠ‌శాల‌లో ఉన్న మొత్తం విద్యార్థుల‌కు, బోధ‌నా మ‌రియు బోధ‌నేత‌ర సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీరిలో 16 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ‌య్యింది.

Leave A Reply

Your email address will not be published.