వికారాబాద్ జిల్లాలో చిరుత దాడిలో ఆవు మృతి

కుల‌క‌చ‌ర్ల (CLiC2NEWS): వికారాబాద్‌ జిల్లాలో చిరుత సంచ‌రిస్తుంద‌న్న వార్త స్థానికంగా కలకలం రేపుతున్నది. జిల్లాలోని కులకచర్ల మండలం చెర్వుముందలి తండాలో శంకర్ అనే రైతుకు చెందిన పొలం వద్ద సోమవారం రాత్రి ఓ ఆవుపై చిరుత దాడిచేసి చంపేసింది. ఈ ఘ‌ట‌న‌పై రైతు అటవీశాఖ అధికారులకు తెలిపారు. విష‌యం తెలిసిన వెంట‌నే అధికారులు ఘ‌టనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.