దానా తుపాను ఎఫెక్ట్.. దాదాపు 200 రైళ్లు రద్దు, దారి మళ్లింపు

విశాఖ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తీరం దాటుతున్న క్రమంలో పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే దాదాపు 200 రైళ్ల రాకపోకాలను రద్దు చేసింది. వీటిలో కొన్ని సర్వీసులను దారిమళ్లించింది. ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దానా తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందకు కదులుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా బలపడనుంది.
23,24,25 తేదీల్లో ఉన్న పలు రైళ్లను రద్దు చేశారు. వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744618, 8712641255, 7780787054 నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
మరోవైపు దానా తుఫానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 27న జరగాలి్సి ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా చేసింది. 23, 25 తేదీలలో జరగాల్సి పరీక్షలన్నిటినీ రద్దు చేసినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం గురించి మొత్తం 17 నగరాల్లో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు:
Sl.no. |
RAILWAY STATION |
PHONE NUMBERS |
1. | Hyderabad | 9063330400 |
2. | Kazipet | 07027782660 |
3. | Secunderabad | 040-27786140, 27786170 |
4. | Khammam | 7815955306 |
5. | Warangal | 9063324898 |
6. | Samalkot | 088-42327010 |
7. | Nellore | 0861-2345863 |
8. | Vijayawada | 0866-2576924 |
9. | Rajahmundry | 0883-2420541 |
10. | Anakapalli | 7569305669 |
11. | Eluru | 7569305268 |
12. | Gudur | 08624-250795 |
13. | Nidadavolu | 08813-223325 |
14. | Ongole | 8592280306 |
15. | Tirupati | 6302216220 |
16. | Renigunta | 9949198414 |
17. | Dhone | 7815915535 |