Accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డిసిఎం ఒకరు మృతి

కడ్తల్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలో రోడ్డుప్రమాదంలో ఒకరు మరణించారు. మండలంలోని ముచ్చర్ల గేట్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను డీసీఎం వాహనం బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని డీసీఎం డ్రైవర్ మొయినుద్దీన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.