బీచ్‌లో గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
అచ్యుతాపురం (CLiC2NEWS): సీతాపాలెం సముద్రతీరానికి వెళ్లి గల్లంతైన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒకరు నిన్న ప్రాణాలతో బయటపడగా.. ఒకరి మృత దేహం లభ్యమయింది. ఇవాళ ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి.
అనకాపల్లి డైట్ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థులు శుక్రవారం పరీక్షలు ముగించుకొని సీతాపాలెం బీచ్‌కు వెళ్లారు. సముద్రంలోకి స్నానికి వెళ్లిన ఏడుగరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. వారిలో ఒకరు మృతి చెందగా.. మరొక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.