జాతీయ పోలీసు అకాడ‌మీలో దీక్షాంత్ స‌మారోహ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 72వ ఐపీఎస్ బ్యాచ్ అధికారులు దీక్షాంత్ స‌మారోహ్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ హాజ‌ర‌య్యారు. దీక్షాంత్ మారోహ్  సంద‌ర్భంగా శిక్ష‌ణ పొందిన 178 మంది అధికారులు ప‌రేడ్ నిర్వ‌హించారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వారి నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

శిక్ష‌ణ పొందిన వారిలో 144 మంది ఐపీఎస్‌లు, 34 మంది ఫారెన్ ఆఫీస‌ర్ ట్రైనీలు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. 144 మందిలో 23 మంది మ‌హిళా ఐపీఎస్ అధికారులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు 8 మందిని కేటాయించారు. తెలుగు రాష్ట్రాల‌కు న‌లుగురు చొప్పున రానున్నారు.

Leave A Reply

Your email address will not be published.