ఆదిపురుష్: హీరో ప్రభాస్‌తో పాటు మూవీ టీమ్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు

ఢిల్లీ (CLiC2NEWS): ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై పలు వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రం.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ చిత్రం విడుదలపై స్టే విధించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు హీరో ప్రభాస్‌తో పాటు మూవీ టీమ్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ చూసిన సినీ ప్రేక్షకులు యానిమేటెడ్ చిత్రంలా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ఈ చిత్రంపైనే ఈ చర్చ జరుగుతుంది. రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలు సరైన విధంగా చూపించలేదని, పలు సంఘాలు అభ్యంతరరాలు వ్యక్తం చేశాయి.