జలమండలిని సందర్శించిన ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్ సౌరభ్ భరద్వాజ్
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/JALAMANDALI-1.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్ సౌరభ్ భరద్వాజ్ శనివారం జలమండలిని సందర్శించారు. జలమండలిలో రెవెన్యూ, ఐటీ విభాగాల్లో చేపడుతున్న సంస్కరణలను అధ్యయనం చేయడానికి ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్ ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జలమండలి అవలంభిస్తున్న బిల్లింగ్ విధానం, వినియోగిస్తున్న సాంకేతికత, రెవెన్యూ, ఐటీ, ఆన్‌లైన్ సేవలు, ఎస్పీటి తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం ఆయనని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, సీజీఎం శ్రీధర్, రెవెన్యూ, ఐటీ విభాగాల జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
Your article helped me a lot, is there any more related content? Thanks!