Delhi LockDown: మరో వారం పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో వారం రోజులు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్లు ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిందని చెప్పారు. 24 గంటల్లో కొత్తగా 1,600 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడితే నెలాఖరు నుంచి అన్‌లా‌క్‌ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తేనే థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని, అందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. 3 నెలల్లోనే ఢిల్లీ మొత్తం వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న‌ప్ప‌టికీ వ్యాక్సిన్ కొర‌త వేధిస్తుంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్ర స‌ర్కార్‌తో పాటు విదేశాల నుంచి టీకాల‌ను సేక‌రించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని కేజ్రీవాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.