వరద బాధితులకు ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ విరాళం

అమరావతి (CLiC2NEWS): ఎపిలోని వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ప్రకటించారు. రేపు సిఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు సమయంలోనిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం వరద తగ్గుతోందని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తీరు వల్లే ఈ ఇబ్బందులని.. పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించాలనుకున్నా.. కానీ, నావల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నానన్నారు. నా పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదన్నారు.
వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. హీరో మహేశ్ బాబు రూ. కోటి విరాళం ప్రకటించారు. ఎపి, తెలంగాణ సిఎం సహాయ నిధికి చెరో రూ. 50లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్లు ఎస్ వేదికగా వెల్లడించారు.