జనసేన పార్టి నడపడానికి ‘వకీల్‌సాబ్’ ఇంధనంలా పనిచేసింది: పవన్‌కల్యాణ్
రాజమహేంద్రవరం (CLiC2NEWS): గేమ్ ఛేంజర్ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో జరిగింది. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా హీరో, దర్శకులు, నిర్మాత గురించి సభావేదికగా మాట్లాడారు. రామ్‌చరణ్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమన్నారు. బాబాయిగానే కాదు, ఓ అన్నగా చరణ్‌ని ఆశీర్వదిస్తున్నానన్నారు. తండ్రి మెగా స్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు అన్నారు.
భారత సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో శంకర్ ఒకరన్నారు. తెలుగులో గేమ్ ఛేంజర్ అద్భుతమైన సినిమా తీసారన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు తాను బ్లాక్‌లో టికెట్ కొనుక్కొని మరీ చూశానని తెలిపారు. నిర్మాత దిల్ రాజు .. తొలిప్రేమ సినమా అపుడు డిస్ట్రిబ్యూటరని.. తన మూవీ పోస్టర్ చూసి అడ్వాన్స్ ఇచ్చారన్నారు. తర్వాత తనతో వకీల్ సాబ్ తీసారన్నారు. డబ్బులేక ఇబ్బంది పడుతున్న సమయంలో సినిమా అవకాశం ఇచ్చారన్నారు. వకీల్ సాబ్ చిత్రం తనకు జనసేన పార్టి నడిపేందుకు ఇంధనంలా పనిచేసిందని పవన్ తెలిపారు.