పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..

భువనేశ్వర్ (CLiC2NEWS): ఒడిశాలో గూడ్స్‌రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 బోగీలు బోల్తా పడ్డాయి. బోగీల కింద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు వేచిఉండే గది వద్దకు బోగీలు దూసుకు రావడంతో మరికొంత మంది బోగీల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఆ మార్గం గూండా వెళ్లే రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.