ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ధర్నా

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలోని 29 రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర సర్కార్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ న్యూడిల్లీ విద్యుత్ ఉద్యోగులు `బిజిలి క్రాంతి యాత్ర` పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు.. ఇంజినీర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర సర్కార్ 2022 ఆగస్టు 8న విద్యుత్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పరిశీలన కోసం పంపింది. రానున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పరిశీలనకు, ఆమోదానికి పంపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా మిగతా పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
కాగా బుధవారం విద్యుత్ ప్రవేట్కరణకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. కాగా విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించకపోతే దేశంలో 28 లక్షల మంది ఉద్యోగులు ఉద్యమిస్తారంటూ పలువురు హెచ్చరించారు.

Hello there! I simply want to offer you a huge thumbs up for the great info you have got here on this post. I will be coming back to your website for more soon.