కనకదుర్గమ్మకు డైమండ్ నెక్లెస్..

విజయవాడ(CLiC2NEWS): ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గాదేవికి ఒక భక్తుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన బి.పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులైన బలరామ్‌కు నెక్లెస్‌ను అందజేశారు. సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.