Dilip Kumar: దిలీప్ కుమార్ కన్నుమూత

ముంబయి (CLiC2NEWS): బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన చికిత్స నిమిత్సం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం (జూలై 7న) తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. జూన్ 30న ఆయన ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరగా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియూ)లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్రస్తుతం బాగున్నారని ఇటీవల ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే అంతకుముందు జూన్ 6న దిలీప్ కుమార్ ఊపిరి తీసుకోవడంలో సమస్య రావడంతో ఆసుపత్రిలో చేరారు. ప్లూరల్ ఎఫ్యూషన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో దీలిప్ కుమార్ మరణించారు.
- దిలీప్‌కుమార్1922 డిసెంబరు 11న పాక్‌లోని పెషావర్‌లో జననం
- సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మిన దిలీప్‌కుమార్
- 1944 నుంచి 1998 వరకు చిత్రసీమను ఏలిన దిలీప్‌కుమార్
- ఉత్తమ నటుడిగా 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు.
- 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
- 2015లో దిలీప్‌కుమార్‌ను వరించిన పద్మవిభూషణ్ పురస్కారం
- 1991లో దిలీప్‌కుమార్‌ను పద్మభూషణ్‌తో సత్కరించిన కేంద్రం సర్కార్
- 1993లో దిలీప్‌కు ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ పురస్కారం
- 1998లో దిలీప్‌ను నిషాన్-ఇ-ఇంతియాజ్ అవార్డుతో సత్కరించిన పాక్
- 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా దిలీప్‌కుమార్ సేవలు