తెలంగాణలో ఎంబిసిలకు ఇ-ఆటోరిక్షాల పంపిణి..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం 60% సబ్సిడీతో ఇ-ఆటో రిక్షాలను ఎంబిసీలకు పంపిణీ చేసింది. మంత్రి గంగుల కమాలాక్ ఈరోజు సంక్షేమ భవన్‌లో 12 మంది ఎంబిసీలకు 12 అటోలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నదని అన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రంలోని బిసి, ఎంబిసిలు ఉన్నత వర్గాల వారికి దీటుగా చదువుకోవాలని, పదవులు అలంకరించాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఇ-ఆటోల కొరకు 500 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 36 మందికి ఆటోలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. 12 మంది లబ్ధిదారులకు ఈరోజు ఆటోలను అందించామని తెలియజేశారు.