చేతులెత్తి మొక్కుతాం..
నేడు డాక్టర్స్ డే దినోత్సవం సందర్భంగా..

ఓ అపర ధన్వంతరులారా
మీరే మా ప్రాణదాతలు
నిత్యం కనిపించే దేవతలు
మాకు జీవంపోసే బ్రహ్మలు
నవమాసాలు మోసే పడతికి తల్లిగా మారుజన్మ నిస్తారు.. పసిపాపల కనుపాపలా కాపాడే సంరక్షకుడవై
ఊపిరులందిస్తారు
గుడ్డి వాడికి రంగులప్రపంచం చూపిస్తారు కుంటివాడిని పర్వత శిఖరం అధిరోహింపజేస్తారు.. మూగవాడికి తేనెలొలికే మాటలందిస్తారు యమ పాశంనుండి రోగికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు
రోగులతో నీకు నిత్య సహవాసం
జీవులకోసం చేస్తారు సాహసం
ఎండలేదు,వానలేదు
ఆకలిదప్పులు లేవు
ఆరోగ్య సేవలోనే నిరంతరం
ధార పోస్తారు
మీ జీవితం
ఓ త్యాగ మూర్తులారా మీకు ఏమివ్వగలం
చేతులెత్తి మొక్కుతాం
శిరసువంచి నమస్కరిస్తాం
-ఎస్.వి రమణా చారి
సీనియర్ జర్నలిస్ట్