కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేసిన మార్త రమేష్

హైదరాబాద్(CLiC2NEWS): స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి మలి దశ ఉద్యమాలలో మరియు రాజకీయ రంగంలో నిజాయితీగా, నిబద్ధత తో పనిచేసి తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న గొప్ప దార్శనికుడు, త్యాగధనుడు మరియు స్ఫూర్తిప్రదాత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు అని కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ సమితి వైస్ చైర్మన్ డాక్టర్ మార్తా రమేష్ తెలియజేశారు.
ఆంధ్ర వలస పాలకుల చేతిలో తెలంగాణ ప్రాంతం బందీ అయి ఉన్నన్ని రోజులు ఇక్కడి గొప్ప గొప్ప వ్యక్తులకు ఏ రోజు సముచితమైన గౌరవం దక్కలేదు అని ఎంత గొప్పవాడు అయినప్పటికీ సెకండరీ స్థాయి వ్యక్తిగానే మిగిలిపోయాడు అని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి గౌరవనీయులు కెసిఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ వైతాళికుడికి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సముచితమైన స్థానాన్ని ఇస్తూ వారి గొప్పతనాన్ని చరిత్రలో సుస్థిరం చేస్తున్నాడు అని అన్నారు.
ఎన్నో కష్టనష్టాలకు ఓరుస్తూ నీతిగా నిజాయితీగా పనిచేస్తూ జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగినాడు కొండ లక్ష్మణ్ బాపూజీ, ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ, అన్నిటినీ తృణప్రాయంగా వదిలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, వారి చరిత్ర ఎంత చెప్పినా తరగనిది, అటువంటి గొప్ప వ్యక్తి జయంతి ఉత్సవ సమితి లో వైస్ చైర్మన్ గా పనిచేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడాలి అని కోరుకుంటున్నాను.
ఈ రోజు రవీంద్రభారతి హైదరాబాద్ లో అధికారికంగా జరిగిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారికి, గౌరవ అతిథులు బండారు దత్తాత్రేయ హర్యానా రాష్ట్ర గవర్నర్ గారికి, ఎక్సైజ్, క్రీడలు & యువజన సేవలు, పర్యాటకం & సంస్కృతి మరియు పురావస్తు శాఖల మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి,
ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు ఎల్ రమణ గారికి, అద్యక్షులు చింత ప్రభాకర్ మాజీ శాసన సభ్యులు గారికి,
ముఖ్య సలహాదారులు గుండు సుధారాణి మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గారికి, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మ్యాడం బాబురావు గారికి, గోశిక యాదగిరి పద్మశాలి సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు గారికి, కందగట్ల స్వామి ఉపాధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, అందరు అతిథులు, ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్ లు, కన్వీనర్లు, సభ్యులు, పద్మశాలి సంఘం పెద్దలు, కొండా లక్ష్మణ్ బాపూజీ బంధు మిత్రులు, అభిమానులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ సమితి వైస్ చైర్మన్ డాక్టర్ మార్తా రమేష్ తెలియజేశారు.