`లెమన్ టీ` తాగుతున్నారా!
ఉదయాన్నే టీ తాగనిదే రోజు కార్యక్రమాలు మొదలుపెట్టరు చాలామంది. ఈరోజుల్లో అందరూ ఆరోగ్యంపైన చాలా శ్రద్ద వహిస్తున్నారు. ఇక కరోనా ఎపెక్ట్‌తో ప్రతిఒక్కరూ ఏది మంచిదో, కాదో ఒకటికి రెండుసార్లు తెలుసుకుని మరీ వాటిని ట్రై చేస్తున్నారు. వర్షాకాలంలో పిల్లలకు, పెద్దలకు సైతం ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ సీజనల్ వ్యాధులు తగ్గించుకోవాడినికి కొన్ని గృహ చిట్కాలు తెలుసుకుందాం.
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుందన్న విషయం తెలిసినదే. ఉదయాన్నే టీ అలవాటు ఉన్న వారు ప్రతిరోజూ లెమన్ టీ తీసుకోండి.
- ఊపిరి తిత్తులలో పేరుకున్న కఫాన్ని బయటకు పంపుతుంది. చక్కెరరు బదులుగా తేనెను ఉపయోగిస్తే ప్రయోజనంగా ఉంటుంది.
- ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి బాగా పుక్కిలించండి. ఇలా చేసిన వెంటనే కఫం బయటకు వస్తుంది.
- లెమన్ టీ అలెర్జీలు, ఇన్ఫక్షన్లనుంచి రక్షించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
- పాలు లేని ఏ` టీ`లో అయినా లెమన్ ఉపయోగించవచ్చు. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.