ఎస్.వి.రమణా చారి: మాదక ద్రవ్యం.. యువతకు నష్టం

కాలేజీ చదువులంటే బలాదూర్
సమూహంతో సాగుతూ చేస్తారు తమాషా
చలాకీగా సాగుతుంది దోస్తానీ
కలిసి చదువుల పేరుతో కాలక్షేపం
చిన్న చిన్నచుక్కలతో విందులు ప్రారంభం
మందుతో పెరుగుతుంది విందుల శోభ
జన్మదిన వేడుకలు అంటూ నిత్యం సరదాలే
ఎవడో అందిస్తాడు కొత్త రకం గుళిక
గుట్టుక్కు మనగానే దర్శన మిచ్చును వింతప్రపంచం
నిత్య పండుగతో కళకళ లాడును నీశోభ
విందులే లేకుంటే కలుగుతుంది క్షోభ
ఇక మైమరిచేవు నీ కుటుంబం
చదువుపట్ల సన్న గిల్లు శ్రధ్ధ
రూపుమారి అవుతావు దేవదాసు
డబ్బుల కోసం నిత్యం తపన
కన్నవారికి కథలు చెప్పుతూ
మునిగేవు మైకపు లోకం
అలా సాగకుంటే …
నీ అడుగులు పట్టును వక్రమార్గం
చివరకు అవుతావు అడిక్టు
నీవు మారుతావు శాడిస్టు
మత్తు కోసం మనీ
చేయని దారుణాలు చేయమని
అవుతావు క్రిమినల్….
మత్తు చూపిస్తుంది గమ్మత్తు
మునిగితే అవుతావు చిత్తు
వద్దుర తమ్మీ మాదక ద్రవ్యం
అందులో పడితే మనకెంతో ఆర్ధిక(భవిష్య) నష్టం
–ఎస్.వి.రమణా చారి,
సీనియర్ జర్నలిస్ట్