వచ్చేనెల 1వ తేదీనుండి ఎడ్‌సెట్ కౌన్సిలింగ్..

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ డిసెంబరు 1వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఎడ్‌సెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలియజేశారు. అభ్యర్థులు వచ్చేనెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. వెబ్ అప్షన్లు డిసెంబరు 18 నుండి 20వ తేదీ వరకు ఉంటాయి. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు వచ్చిన అభ్యర్థులు వచ్చేనెల 28వ తేదీ లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. డిసెంబరు 30 నుండి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.