ఎదురు చూస్తున్న ఎముకలు

కరోనా కరాళ నృత్యంతో అసువులు బాసి
చితి మంటల్లో మిగిలిన చివరి జ్ఞాపకాలవి
ఆనవాలుగా అందరికీ తెలిసినవే కానీ
సగౌరవంగా వాటిని అస్థికలని పిలవాలి మరి
అంత్యక్రియల నాడే అల్లంత దూరంలో
నిలిచి, చూసిన కుటుంబ సభ్యులు,
ప్రాణ భయంతో నిస్తేజంగా, నిర్వేధంతో
జంకుతున్నారు…ఎముకులను ముట్టడానికీ
కాలిపోయాయి చివరి చూపు నోచుకోక
అనాథ శవాల వలె ఆస్పత్రుల నుంచి
నేరుగా చేరాయి కట్టెలపైకి
స్వంత ఇల్లు కోట్లాది ఆస్తికి, వారసులే కానీ
వైరస్ సోకితే దరిచేరరు ఏ కొడుకు,కూతురు
ఆ భయం వెంటాడితే అందరూ దూరమే
బంధు మిత్రలెవరు దరి చేరని దుస్థితి
విగత జీవికి తెలియదు మమతానురాగాలు
గంగలో కలుపుతారో, ఏ పుణ్యతీర్థం చేర్చుతారో
పత్రికలకు చెప్పినా,పట్టించుకోని వైనం
ఎప్పటికీ రాని తనవారి కోసం
ఎదురు చూస్తున్నాయి ఎముకలు శ్మశానంలో
అస్థికలని మర్యాదలు వదిలి..
వదిలేస్తున్నారు చెత్త కుండీల్లో
కరోనా రాక్షసి కలుషితం చేసింది
మానవ జాతికే మచ్చగా మిగిలింది..
-కోనేటి రంగయ్య
సీనియర్ పాత్రికేయులు
Gmail: rangaiahkoneti@gmail.com
తప్పక చదవండి:
రైతుల దైన్యం.. పాలకుల దౌష్ట్యం
తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ