బ్యాచిలర్లకు పెళ్లిళ్లు జరిపిస్తా!.. ఎన్నికల ప్రచారంలో వింత హామీలు..
ఛత్రపతి శంభాజినగర్ (CLiC2NEWS): ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీలు కురిపిస్తారన్న విషయం తెలిసందే. కానీ, ఎన్నికల ప్రచారం చేస్తున్న ఓ అభ్యర్థి.. బ్యాచిలర్లకు పెళ్లిళ్లు జరిపిస్తా.. నంటూ ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రలో బీడ్ జిల్లాలోని పర్లీ నుండి పోటీచేస్తున్న ఎన్‌సిపి అభ్యర్థి రాజే సాహెబ్ దేశ్‌ముఖ్ ఈ వింత ప్రచారం చేయగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.
మహారష్ట్రలో అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిరథ మహారథులందరూ ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా, విచిత్రమైన హామీలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌సిపి అభ్యర్థి దేశ్‌ముఖ్.. ‘నేను ఎమ్మెల్యే అయితే, బ్యాచిలర్లకు పెళ్లిళ్లు జరిపిస్తా.. యువతకు ఉపాధి కల్పిస్తాం, అమ్మాయిని అడిగేటపుడు యువకుడికి ఉద్యోగం/ వ్యాపారం ఉందా అని అడుగుతారు. కానీ ఈ జిల్లా నుండి మంత్రిగా ఉన్న ధనుంజయ్ ముండే పర్లీ ఒక్క పరిశ్రమైనా తీసుకురాలేదు. అందువల్లే స్థానిక బ్యాచిలర్లు ఉద్యోగాలు దొరక్క, పెళ్లిళ్లు చేసేకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారని’ అరోపించారు.