విద్యుత్ షాక్‌: ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

భోపాల్ (CLiC2NEWS): మధ్యప్రదేశ్ లోని ఛతార్‌పూర్ జిల్లాలోని బిజావ‌ర్ ఏరియాలో విషాద‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్య‌క్తుల నిమిషాల వ్య‌వ‌ధిలో ప్రాణాలు విడిచారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీజావ‌ర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వాట‌ర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు కుటుంబ‌స‌భ్యులు ప‌ని మొద‌లు పెట్టారు. దీని కోసం విద్యుత్ మోటార్ సాయంతో ట్యాంక్‌లోని నీటిని ఖాళీ చేస్తున్నారు. ఇంత‌లో కుటుంబ‌సభ్యుల్లో ఒక‌రికి విద్యుత్ వైర్ త‌గిలి షాక్ గురిఅయ్యారు. అత‌డిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో కుటుంబంలోని ఆరుగురు వ్య‌క్తులు నిమిషాల్లో క‌న్నుమూశారు.

స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఒకే సారి కుటుంబంలోని ఆరుగురు స‌భ్యులు ప్రాణాలు కోల్పోవ‌డంతో స్థానికంగా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.